నిజామాబాద్, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇతర అధికారిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈ నెల 20వ తేదీ సోమవారం రోజున జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందన్నారు. తిరిగి జనవరి 27వ తేదీ (సోమవారం) నుండి యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.