బాన్సువాడ, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండల కేంద్రంలోని ద్రోణ ప్రైవేటు పాఠశాలలో ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సాయి ప్రసన్న 284 ర్యాంకు, వివంత్ రాజ్ 479 ర్యాంకులు సాధించారు.
పాఠశాలకు సంబంధించిన ఎనిమిది మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయిలో వెయ్యిలోపు ర్యాంకులు సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు.