నిజామాబాద్, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, లక్ష్మీకాంత్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి తదితులు పాల్గొన్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో ప్రతిష్టాత్మక నాలుగు పథకాలను అమలు చేయడానికి జిల్లా యంత్రాంగాల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. సమీక్షలో ఉమ్మడి జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.