నిజామాబాద్, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆదివారం నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటిలో బోధన్ బార్ అసోసియేషన్ క్రికెట్ జట్టుపై నిజామాబాద్ బార్ అసోసియేషన్ క్రికెట్ జట్టు విజయం సాధించింది. బోధన్ జట్టు సమ్మయ్య నాయకత్వంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బోధన్ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి మొత్తం 128 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ 11.2 ఓవర్లలోనే 129 పరుగులు చేసి విజయాన్ని మూటగట్టుకుంది.
న్యాయవాది సుజిత్ 64 పరుగులు చేసి అల్రౌండర్ ప్రతిభ కనపరిచారు. నిజామాబాద్ బార్ క్రికెట్ జట్టు కెప్టెన్ జగన్మోహన్ గౌడ్ స్ఫూర్తి దాయకమైన ఆటను ప్రదర్శించిన వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బార్ ఉపాధ్యక్షుడు పెండెం రాజు, ప్రధాన కార్యదర్శి వసంత్ రావు మాట్లాడుతూ నేటితో క్రికెట్ పోటీలు ముగిశాయని, క్యారమ్స్, షెటిల్, చెస్, టెబుల్ టెన్నిస్ పోటీలు కొనసాగుతున్నాయని పోటీలలోని విజేతలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిలాకోర్టు ప్రాంగణంలో జరుగనున్న కార్యక్రమంలో జిల్లాజడ్జి సునీత కుంచాల, బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి అతిథులుగా పాల్గొని బహుమతులు అందజేయనున్నారని వారు తెలిపారు.
నిజామాబాద్ బార్ అసోసియేషన్ క్రికెట్ జట్టు జగన్ మోహన్ గౌడ్ కెప్టెన్‌గా వ్యవహరించగా జట్టులో యెర్రం విఘ్నేష్, డాన్పల్, సురేష్, సుజీత్, ఉదయ్ కృష్ణ, ఏ దీపక్ ఎన్ ఎస్ చౌదరి, హామీమ్, ప్రమోద్ వెంకటేశ్వర్, అయ్యబ్, ప్రకాష్ కె ఎస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.