ఆర్మూర్, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ 60,000 చెక్కును ఆర్మూర్ నియోజవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అయిన ఖర్చులను సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పించడం జరుగుతుందన్నారు.
అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారిని తన దృష్టికి తీసుకొస్తే ఎల్డీసీ ఇప్పించి వైద్య సేవలు అందేలా చూస్తాం అన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాక్లూర్ సొసైటీ చైర్మన్ అశోక్, ఆలూర్, మండలం ప్రెసిడెంట్ ముక్కెర విజయ్, రవి ప్రకాష్, ప్రభుకర్, మాజీ సర్పంచ్ గంగారాం, మాజి ఉప సర్పంచ్ భూపతి, గుత్ప సర్పంచ్ చిన్నయ్య, శశి, సుదర్శన్, సాయన్న, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.