నిజామాబాద్, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆటపాటలతో ఆనందం పెరిగి, మానసిక ప్రశాంతత చేకూరుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. సోమవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ క్యారమ్స్ ఆటలపోటీలను ప్రారంభించి కొద్దిసేపు క్యారమ్స్ ఆడారు. అనంతరం మాట్లాడుతూ మనుషుల నిత్యజీవనంలో ఆటపాటలు ఉంటేనే సంతోషాలు వెల్లివిరుస్థాయని తెలిపారు.
గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న శుభతరుణంలో బార్ అసోసియేషన్ వివిధ రకాల క్రీడా కార్యక్రమాలు చేపట్టడం ముదావహమని ఆమె కొనియాడారు. క్యారమ్స్ పై ఆడేటపుడు దృష్టికోణం క్యారమ్స్‌పై ఉండటం వలన కనుచూపు మెరుగు పడుతుందని ఆమె తెలిపారు.
బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ నిత్యం ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొనే న్యాయవాదులు, న్యాయమూర్థులు క్రీడాపోటీలతో స్వాంతన పొందగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యాక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, కార్యదర్శి సురేష్ దొన్పల్, క్రీడల కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, కోశాధికారి దీపక్, న్యాయవాదులు ఎర్రం విగ్నేష్, మానిక్ రాజు, ఆశ నారాయణ, సుజిత్, రణదీశ్, అరేటి, ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.