కామారెడ్డి, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 26 న గణతంత్ర వేడుకలను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించుటకు అధికారులకు కేటాయించిన విధులను సకాలంలో ఏర్పాటుచేయాలని అన్నారు.
స్టేజి, అలంకరణ, ముఖ్య అతిథి సందేశం, మైకు ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా, సాంస్కృతిక కార్యక్రమాలు, అల్పాహారం, రాష్ట్ర స్థాయిలో సి.ఎం.క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు సన్మానం, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడం, తదితర కార్యక్రమాలు ఆయా అధికారులచే ఏర్పాట్లు చేయాలని అన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.