కామరెడ్డి, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ ఆదేశాల మేరకు కుమ్మరి శాలివాహన కులాల కుటుంబాలకు కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి స్రవంతి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 148 ప్రకారం కుమ్మర శాలివాహన కులాల కుటుంబాలకు ప్రభుత్వం కల్పించిన బంక మట్టి ని చెరువుల నుండి ఎలాంటి రుసుము చెల్లించకుండా పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు.
ఫ్యూయల్ ఉడ్ పెంచుకోవడం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడానికి ప్రభుత్వం అనుమతించిందనీ, కాలుష్య నివారణలో భాగంగా మట్టి బాటిల్స్, కప్పులు తయారు చేసుకోవడానికి ప్రోత్సాహం కల్పించడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్, అధికారులు పాల్గొన్నారు.