కామారెడ్డి, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వివిధ రకాల వైకల్యం కలిగిన వికలాంగులకు ఉపకరణాలు అలీమ్ కో వారిచే పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. స్థానిక కేవిఎస్ గార్డెన్ లో వికలాంగులకు ఉపకరణాల పంపిణీ కోసం ఎంపిక శిబిరాన్ని మంగళవారం అలీం కో హైదరాబాద్, జిల్లా సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది.
ఇట్టి శిబిరానికి 572 మంది కామారెడ్డి నియోజక వర్గంలోని దివ్యాంగులు హాజరైనారు. ఇందులో ఎంపికచేయబడిన వారికి అలీం కో వారు ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. ఇట్టి శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. అర్హత కలిగిన వారికి ఉపకరణాలు అందించాలని తెలిపారు. అనంతరం భేటీ బాచావు భేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు అయిన సందర్భంగా సంతకాల సేకరణలో భాగంగా కలెక్టర్ సంతకం చేశారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ఏ.ప్రమీల, దోమకొండ, కామారెడ్డి సి.డి. పి. ఒ.లు, సిబ్బంది పాల్గొన్నారు.