కామారెడ్డి, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజాపాలన గ్రామ సభల్లో ముసాయిదా జాబితాలను చదివి వినిపించి, చర్చించి ఆమోదం పొందాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. మంగళవారం జుక్కల్ మండలం చిన్న గుళ్ళ, పెద్ద కోడపగల్ మండలం చిన్న దేవిసింగ్ తాండా లలో జరిగిన గ్రామ సభలలో ఆయన పాల్గొన్నారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కొరకు గత ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను గ్రామ సభల్లో వివరించి, చర్చించి గ్రామ సభ ఆమోదం పొందాలని తెలిపారు. ఇపుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాటిని తరువాత పరిశీలించడం జరుగుతుందని, దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గ్రామ సభల్లో మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, రెవిన్యూ, గ్రామీణాభివృద్ధి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.