బాన్సువాడ, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో మంగళవారం ప్రజాపాలన వార్డు సభలో సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో ప్రజల నుండి రేషన్ కార్డు లేని వారి దరఖాస్తులను స్వీకరించాలని, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పై ప్రజల సలహాలు సూచనలు స్వీకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అర్హులైన ప్రతి ఒకరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో నాయకులు అమీర్ చావుస్, వార్డు అధికారి, సంబంధిత శాఖల అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.