కామారెడ్డి, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రెండవ రోజు డిగ్రీ,పీజీ విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో వక్తలు గంప నాగేశ్వరరావు, ప్రదీప్, శ్రీపాదరావు, బాలలత, వేణుకళ్యాణ్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి సిద్ధపడాలని కష్టాలతోనే ప్రతి ఒక్కరి జీవితం ప్రారంభమవుతుందని ఆ కష్టాలను తొలగించుకోవడానికి గల మార్గాలను అన్వేషించుకోవాలని, నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే వ్యక్తులు విజయ అవకాశాలను పొందుతారని దానికి సరైన ప్రణాళిక, క్రమశిక్షణ మార్గదర్శకత్వం అవసరమని విద్యార్థులకు సూచించారు.
విద్యా విధానంలో మార్పులు రావలసిన అవసరం ఉందని జీవితానికి అవసరమైన పాఠాలు నేర్పించినప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లైన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద అధ్యక్షులు చిలువేరి మారుతిని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు అభినందించారు.
తెలంగాణ నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఎస్పీ కృష్ణ చైతన్య మాట్లాడుతూ మత్తు పదార్థాలకు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు, ఎక్కడైనా మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే నార్కోటెక్స్ డిపార్ట్మెంట్‌ను సంప్రదించాలని తప్పుడు మార్గంలో వెళ్లే వారికి చట్ట ప్రకారం శిక్షలు తప్పవని అన్నారు.
కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్, కో చైర్మన్ లయన్ ఉప్పల హరిధర్, లయన్ కైలాస్ భూపేష్, రీజియన్ చైర్మన్ విజయానంద్, ఇంపాక్ట్ రీజియన్ అధ్యక్షులు నక్క నవీన్, లయన్స్ క్లబ్ వివేకానంద కార్యదర్శి లయన్ కృష్ణ హరి, క్యాషియర్ లయన్ మురికి రాజశేఖర్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి, సాందీపని విద్యా సంస్థల డైరెక్టర్లు హరిస్మర్ రెడ్డి, బాలాజీ సదాశివరెడ్డి, సత్యనారాయణ, నవీన్, లైన్స్ క్లబ్ సభ్యులు ఇంపాక్ట్ మోటివేటర్లు పాల్గొన్నారు.