హైదరాబాద్, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్ రీస్ సంస్థకు సంబంధించిన భూములను కాపాడి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చి ఆగ్రో సంస్థను లాభాల బాటలు నడిపించడమే తన లక్ష్యమని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బుధవారం హైదరాబాద్ మౌలాలిలోని 23 ఎకరాల 28 గుంటల భూమి ఉండగా మూడు ఎకరాల భూమి కబ్జాకు గురికావడంతో హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
హైడ్రా అధికారులు ఆదిత్య, హేమలత కబ్జాకు గురైన భూమిని పరిశీలించి హైడ్రా నిబంధనల ప్రకారం ఉన్నత అధికారులకు నివేదిక అందించి చర్యలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఆగ్రో సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.