మాచారెడ్డి గ్రామసభల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్‌

మాచారెడ్డి, జనవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

అర్హులైన పేదలకు పథకాలు అమలు పరచడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం మాచారెడ్డీ మండలం అక్కాపూర్‌, కొత్తపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి పథకాలు అమలు కొరకు గ్రామసభలో జాబితాలను చదివి వినిపించడం జరుగుతుందని, అట్టి వాటిలో అభ్యంతరాలు ఉంటే గ్రామసభలో తెలియజేయాలని అన్నారు.

Check Also

సీనియర్‌ న్యాయవాది మృతి

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »