బిచ్కుంద, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బిచ్కుందలోని రైతు వేదిక హాల్లో వికలాంగుల ఉపకరణముల ఎంపిక శిబిరం అలీమ్ కో హైదరాబాదు మరియు జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. శిబిరానికి జుక్కల్ నియోజకవర్గం లోని మంది వివిధ రకాల వైకల్యము కల 493 వికలాంగులు హాజరయ్యారు.
శిబిరములో ఎంపిక చేయబడిన వికలాంగులకు అలింకో కంపెనీ ద్వారా ఉచితముగా ఉపకారణాల పంపిణీ చేయబడుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, మద్నూర్ సిడిపివో, సూపర్వైజర్లు, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.