రిపబ్లిక్‌ డే వేడుకకు ముస్తాబైన పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌

నిజామాబాద్‌, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం ఉదయం 9.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రిపబ్లిక్‌ డే వేడుకకు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులతో నిర్వహించిన సమీక్షలో సూచించారు.

వేదిక, ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్ల గురించి సంబంధిత శాఖల అధికారులతో ఐ.డీ. ఓ.సీలో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఈ మేరకు సంభందిత అధికారులు పోలీస్‌ పరేడ్‌ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, జనవరి.27, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »