ఎల్లారెడ్డి, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలో 300 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నిర్మాణాలు ఎవరు పట్టించుకోక అసంపూర్తిగా ఉండి, మధ్యలో ఆగిపోయి, సగం కూలిపోయి, దొంగలకు, తాగుబోతులకు అడ్డాగా మారిందని, ఇటువంటి సంఘటనలు చూడలేక, ప్రత్యేక శ్రద్ధ చూపి పదవి స్వీకరించిన సంవత్సర కాలంలోనే ఈ ఇండ్లను పంపిణీ చేయాలని దృఢ సంకల్పంతో నిరంతరం అధికారులతో మాట్లాడుతూ వారిపై ఒత్తిడి తెస్తూ ఇళ్లను పూర్తి చేయించడం జరిగిదన్నారు.
నిధులు లేక కాంట్రాక్టర్లు రాక ప్రత్యేకంగా కాంట్రాక్టర్లను పిలిపించి వారికి తన సొంత నిధులు ఇచ్చి ఈ ఇండ్లను పూర్తి చేయించమన్నారు. 300 ఇండ్లకు గాను ఇండ్ల నిర్మాణానికి – 15 కోట్ల 90 లక్షలు, త్రాగునీటి వసతి కోసం – 87 లక్షలు, డ్రైనేజీ వసతి కోసం – 55 లక్షలు, ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫారం, పోల్స్ కోసం – 37 లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణం కోసం – 62 లక్షలు, బజార్ లైటింగ్ కోసం – 3 లక్షలు, మొత్తం – 18 కోట్ల 34 లక్షలతో ఈ ఇండ్లను పూర్తి చేసామని వివరించారు.
ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు చివరి దశలో ఉన్నాయి. వాటిని కూడా త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూములు అందని వారు ఎటువంటి అదైర్యానికి లోను కాకూడదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అవకాశం కల్పించి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి పేద ప్రజల సంక్షేమమే కోరుకుంటుందన్నారు.
నేడు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను ప్రారంభిస్తున్నాం . ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులకు నేడు అట్టహాసంగా ప్రారంభిస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అమలాయ్యేలా కార్యచారణ రూపొందించాము. ఎటువంటి ప్రలోభాలకు గాని, అనుమానాలకు గాని గురికావద్దు. ప్రతి ఒక్కరికి మా పథకాలు మీ ఇంటికి గడపకు చేరేలా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. మరికొన్ని రోజుల్లో మిగతా పథకాలు కూడా ప్రారంభించి దేశంలోనే నెంబర్ వన్ ప్రభుత్వంగా తీర్చి దిద్దబోతున్నాము. ఎల్లారెడ్డిని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు.
డబల్ బెడఁరూం లబ్ధిదారులు అందరు ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులను ఎల్లారెడ్డి మండలం మల్లాయపల్లి మరియు నాగిరెడ్డిపేట మండలం అచ్చాయిపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డివో మన్నే ప్రభాకర్, మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కౌన్సిలర్లు, ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు కుర్మ సాయి బాబా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.