కామారెడ్డి, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి ప్రతిభను ప్రదర్శించారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక కళాభారతి లో అధికారికంగా ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులు దేశభక్తి కి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారని, విద్యార్థుల ప్రతిభను చాటారని తెలిపారు.
ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల విద్యార్థిని శాస్త్రీయ నృత్య ప్రదర్శన అద్భుతంగా ప్రదర్శించింది. పాల్వంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రెడ్డిపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాన్సువాడ గిరిజన ఆశరమ పాఠశాల, మహాత్మా జ్యోతిబా ఫూలే బి.సి.సంక్షేమ పాఠశాల జంగంపల్లె, కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాల విద్యార్థుల నృత్య ప్రదర్శన, కామారెడ్డి సమీకృత బాలికల సంక్షేమ వసతి గృహ సమాదాయం విద్యార్థులచే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
అలాగే తెలంగాణ సాంస్కృతిక కళాకారులు పాటల రూపంలో దేశభక్తి అద్భుతంగా వివరించారు. అనంతరం ఆయా టీమ్ లకు కలెక్టర్ మెమోంటోలు బహుకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందు ప్రియ, జిల్లా అధికారులు, పాఠశాలల విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.