మాక్లూర్, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మండలంలో సీనియర్ జర్నలిస్ట్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. సీనియర్ జర్నలిస్టుగా పేరుపొందిన లక్ష్మీనారాయణ హఠాత్ మరణం చెందడంతో వారి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కల్పించారు.
అనంతరం మండల వ్యాప్తంగా మరికొందరి కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో మీడియా మిత్రులు మాక్లూర్ మండల మాజీ సర్పంచ్ అశోక్ రావు, మండల బీఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ ప్రభాకర్ గోపు రంజిత్, రమేష్, అభిలాష్, తదితరులు పాల్గొన్నారు.