నిజామాబాద్, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మాక్లూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బిసి బాలికల గురుకుల పాఠశాల, దాస్‌నగర్‌లో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్‌తో ఉపాధ్యాయులందరికీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు స్వప్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యాన్ని వివరించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పలు సూచనలు చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థినిలకు పలు సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా ఫ్యాన్సీ డ్రెస్ షో ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా విద్యార్థినిల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు, సిబ్బంది పాల్గొన్నారు.