నిజామాబాద్, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్వప్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల గురించి వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని చేరుకోవటానికి తగిన కృషి చేయాలన్నారు.
సీనియర్ లెక్చరర్ సురేష్ మాట్లాడుతూ విద్యార్థుల మీద సోషల్ మీడియా ప్రభావం ఇటీవల ఎక్కువైందని, దీన్ని అధిగమించి చదువుపట్ల శ్రద్ద వహించాలని సూచించారు. నైపుణ్యాలను అబివృద్ధి చేసుకుంటే వ్యక్తిగత జీవితంలో, అలాగే ఉద్యోగ రంగాల్లో మంచి అవకాశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫైనల్ ఇయర్ విద్యార్థినిలు ప్రిన్సిపాల్ భారత్ చిత్రపటాన్ని బహుకరించారు.
కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థినిలు, సిబ్బంది పాల్గొన్నారు.