కామారెడ్డి, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు మహమ్మద్ ఇసాక్ షేరు, చాట్ల రాజేశ్వర్, పాత శివ కృష్ణమూర్తి, మైనార్టీ సెల్ అధ్యక్షులు సిరాజుద్దీన్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, బీసీసెల్ జిల్లా అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు కైలాస లక్ష్మణ్, బట్టు మోహన్, జొన్నల నర్సింలు, హరికిషన్ గౌడ్, జమీల్, పాక రవి ప్రసాద్, సర్వర్, సాజిద్, అతిక్, రఫిక్, దోమకొండ శ్రీనివాస్, లక్ష్మీరాజం, గజవాడ శంకరైయ్యా, పార్షి వెంకటేశం, యమహిళా కాంగ్రెస్ సుమ నాయకురాలు, యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.