నిజామాబాద్, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భస్తపూర్వ గర్భస్థ పిండా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశము డిఎంహెచ్‌ఓ డాక్టర్ బి రాజశ్రీ అధ్యక్షతన డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిని మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయడం జరుగుతుంది అన్నారు. అదేవిధంగా ఏ స్కానింగ్ కేంద్రంలో అయినా గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేసిన తర్వాత పుట్టబోయే శిశువు ఆడ లేదా మగా అని తెలియజేస్తే పిసిపిఎన్డిటి చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోబడుతాయన్నారు.
ఆర్‌ఎంపి, పిఎంపీలు రిఫర్ చేసిన ప్రీస్క్రిప్షన్స్‌ని ఏ స్కానింగ్ సెంటర్ వైద్యులు కూడా సమ్మతించి స్కానింగ్ చేయరాదని, ఆర్.ఎం.పి పిఎంపీలు వారి నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ప్రథమ చికిత్స కేంద్రాలుగా కొనసాగించాలన్నారు. మెడికల్ షాపుల్లో ఆబార్షన్ కొరకు వాడే ఔషధాలను క్వాలిఫైడ్ డాక్టర్ రిఫరల్ స్లిప్పు లేనిదే అమ్మ రాదని తెలియజేశారు. జిల్లాలో ఉన్న స్కానింగ్ కేంద్రాలన్నీ రికార్డులను, రిపోర్టులను క్రమం తప్పకుండా నమోదు చేయాలని, లేనిచో వారికి రిజిస్ట్రేషన్ కానీ, రినెవల్స్ కానీ చేయడం జరగదు అన్నారు.
అదేవిధంగా జిల్లాలో విస్తృతంగా అవగాహన సదస్సులను పిసిపి ఎన్డిటి చట్టంపై , బ్రూన హత్యలపై, ఆడపిల్ల ప్రాధాన్యతపై, బేటి బచావో బేటి పడాఓ పై, పాఠశాలల్లో, కళాశాలల్లో, గ్రామ మరియు మండల స్థాయి సమాఖ్య సమావేశాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగే అమ్మ ఒడి కార్యక్రమాల్లో, నెలవారి సమావేశాల్లో, ఆశాలు గృహ సందర్శనలో ,ఐకెపి, మెప్మా ,డిఆర్డిఏ నెలవారి సమావేశాలలో వివిధ శాఖల సమన్వయంతో విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు.
జిల్లాలో మొత్తం ఆరు టీం ల ద్వారా జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో నూతనంగా స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ కోసం ఒక దరఖాస్తు, స్కానింగ్ సెంటర్ రెన్యువల్ కోసం ఏడు దరఖాస్తులు రావడం జరిగింది అన్నారు.
సమావేశంలో రేడియాలజిస్ట్ డాక్టర్ దీప్తి, పిల్లల వైద్యులు డాక్టర్ హరిప్రియ, గైనకాలజిస్ట్ డాక్టర్ కీర్తి ప్రియ, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అంజన, డాక్టర్ సమత, డాక్టర్ రాకేష్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుప్రియ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధా, మహిళఎన్జీవో పద్మాసింగ్, ఆరోగ్య చైతన్య వేదిక నుండి ఘన్పూర్ వెంకటేశ్వర్లు, మెప్మా నుండి మాధురి, మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి సౌమ్య, డెమో నాగలక్ష్మి , డిహెచ్‌ఈ జి వేణుగోపాల్, దేవేందర్ హాజరైనారు.