కామారెడ్డి, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సరంపల్లి ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్ డే రోజున పాఠశాలలో నీటి సమస్య ఉందని గ్రామస్తులకు తెలుపగా గ్రామ పెద్దలు అందరూ కలిసి పాఠశాలలో బోర్ వేయించారు. కాగా శుక్రవారం స్థానిక మాజీ వార్డ్ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ తన స్వంత ఖర్చులతో మోటార్ ఇప్పించి ఫిట్టింగ్ చేయించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో నీటి సమస్య తీర్చి బోర్ వేయించిన దాతలు కొత్తూరు పెద్ద సాయిలు, ముల్క శ్రీను, అశోకరావు, నవీన్, రాజారాం, రాజు, కృష్ణ, శివరాజు, శేఖర్, ఆంజనేయులు దాతలు అందరికీ సరంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పటేల్ అనిల్ ఉపాధ్యాయులు సుధారాణి, రాజయ్య, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున దాతలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పొన్నాల సంధ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.