Monthly Archives: January 2025

లక్ష్యం దిశగా ముందుకు సాగాలి…

కామరెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వార్షికోత్సవం, స్పోర్ట్స్‌ డే సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులు కష్టపడి ప్రతీరోజూ చదవాలని, పరీక్షలకు కేవలం 30 రోజుల వ్యవధి మాత్రమే ఉందని తెలిపారు. …

Read More »

పాఠశాలల ఆకస్మిక తనిఖీ

నందిపేట్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని నూత్‌ పల్లి, తొండాకూర్‌ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నూత్‌ పల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా లేకపోవడానికి గమనించిన కలెక్టర్‌, గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నాసిరకంగా …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జనవరి.28, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.29 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 8.58 వరకుయోగం : వజ్రం రాత్రి 12.34 వరకుకరణం : భద్ర ఉదయం 7.34 వరకుతదుపరి శకుని రాత్రి 7.29 వరకు వర్జ్యం : సాయంత్రం 5.01 – 6.38దుర్ముహూర్తము : ఉదయం 8.52 …

Read More »

చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్‌ సెంటర్‌లపై కఠిన చర్యలు

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భస్తపూర్వ గర్భస్థ పిండా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశము డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి రాజశ్రీ అధ్యక్షతన డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిని మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్‌ సెంటర్ల రిజిస్ట్రేషన్‌ అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్‌ కేంద్రాలకు …

Read More »

ఎన్నికల సామాగ్రి సిద్దంగా ఉంచాలి..

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామాగ్రి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలోని గోదాము లోని పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే సామాగ్రిని, బ్యాలెట్‌ బాక్స్‌ లను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి సరఫరా అయిన పంచాయతీ …

Read More »

ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 225 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను …

Read More »

పెండిరగ్‌ అర్జీలను పరిష్కరించండి

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పలు శాఖల్లో పెండిరగులో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇప్పటి వరకు 19501 అర్జీలు రాగా, 18838 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, ఇంకనూ 663 …

Read More »

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి, క్లోరోఫామ్‌, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ, నిరంతరం నిఘాను కొనసాగించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం …

Read More »

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్‌ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జనవరి.27, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.39 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల ఉదయం 8.20 వరకుయోగం : హర్షణం రాత్రి 2.00 వరకుకరణం : గరజి ఉదయం 7.28 వరకుతదుపరి వణిజ రాత్రి 7.39 వరకు వర్జ్యం : ఉదయం 6.39 – 8.20 మరల సాయంత్రం 6.11 – …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »