బాన్సువాడ, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర హైకోర్టు జడ్జిలు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ అలిశెట్టిలకు బాన్సువాడకు సబ్ కోర్టు మంజూరు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ సబ్ కోర్టు లేకపోవడం వల్ల డివిజన్ పరిధిలోని బిచ్కుంద,,మద్నూర్,జుక్కల్ ప్రాంతానికి చెందిన వారు జిల్లా కోర్టుకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున బాన్సువాడకు సబ్ కోర్టు మంజూరు చేసేలా కృషి చేయాలని హైకోర్టు జడ్జిలను కోరారు.
కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణమూర్తి, న్యాయవాదులు భూషణ్ రెడ్డి,రమాకాంత్, మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రామిరెడ్డి, ఖలీల్, ఆనంద్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.