కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఏం.ఎల్.సి. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు మాడల్ కోడ్ పాటించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గం ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు.
ఈ ఎన్నికలకు నేడు అనగా ఫిబ్రవరి 3 వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఈ నెల 10 లోగా నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 27 న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మార్చి 3 న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 29 కేంద్రాల పట్టభదులకు,25 కేంద్రలు ఉపాధ్యాయులకు , కామన్ పోలింగ్ కేంద్రాలు 13 ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఇప్పటి వరకు 16417 పట్టభద్రుల నియోజక వర్గం, 2125 ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రభుత్వ భవనాలు రాజకీయ పార్టీల వ్యవహారాలకు వినియోగించ కూడదని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేయకూడదని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ మన్నె ప్రభాకర్, ఎన్నికల విభాగం తహసీల్దార్ సరళ, నాయబ్ తహసీల్దార్ అనీల్, తదితరులు పాల్గొన్నారు.