జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం యొక్క జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌, జిల్లామెజిస్ట్రేట్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధ్యక్షతన నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్‌ బి రాజశ్రీ తెలిపారు.

ఈ కార్యక్రమం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో, సోషల్‌ వెల్ఫేర్‌, బి.సి వెల్ఫేర్‌, మైనారిటీ వెల్ఫేర్‌, కేజీబీవీ, మోడల్‌ పాఠశాలలు, కళాశాలల్లో, హాస్టల్స్‌లో మతపరమైన పాఠశాలలు, కళాశాలల్లో ఈ అల్బెన్దజోల్‌ మాత్రలు అందించబడుతాయని తెలిపారు. విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని తెలియజేసీ, పాఠశాల ప్రార్థన సమయంలో, ఎస్‌ఎంసి సమావేశాల్లో, అంగన్వాడి మదర్స్‌ కమిటీ సమావేశాల్లో, న్యూట్రిషన్‌ డే కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, కళాశాలల్లో కూడా ఈ అల్బెన్దజోల్‌ మాత్రలు తప్పనిసరిగా వేయాలని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అని తెలియజేసారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్‌ బి రాజేశ్రీ మేడం గారు మాట్లాడుతూ అల్బెన్దజోల్‌ మాత్రలు పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని, ఈ మాత్రలు తీసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యానికి మంచిదని, ఈ మాత్ర వల్ల నులిపురుగులను, రక్తహీనతను నిర్మూలించి ,పోషకాహార గ్రాహ్యతను, ఏకాగ్రతను, హాజరు శాతాన్ని పెంచుతుందని , అన్ని పాఠశాలల్లో చేతుల శుభ్రతపై మరియు వీధుల్లో దొరికే చిరుతిళ్లను తినకుండా నిషేధించాలని, భోజనం చేసిన తర్వాతనే ఆల్బెండజోల్‌ మాత్రను చప్పరించి నమిలి తీసుకో నే విధంగా ,ప్రార్థన సమయంలో అవగాహన కలిగించాలని, ఎవరైనా పిల్లలు అనారోగ్యం కారణంగా కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల ఐన అల్బెన్దజోల్‌ మాత్రలు ఫిబ్రవరి 10 వ తారీఖున వేసుకోనట్టయితే మాప్‌ అప్‌ డే నాడు అనగా ఫిబ్రవరి 17 వ తారీఖున తప్పనిసరిగా వేసుకోవాలని తెలియజేసారు.

కార్యక్రమంలో ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులు తమ వంతు బాధ్యతగా 100 శాతం విద్యార్థులు ఆల్బెండజోళ్ళు మాత్రలు తీసుకునేలా బాధ్యత తీసుకోవాలని, అంగన్వాడి టీచర్లు వారి వద్ద ఉన్న రిజిస్టర్డ్‌, అన్‌ రిజిస్టర్డ్‌ పాఠశాల ,కళాశాలకు వెళ్లని విద్యార్థుల జాబితా ఆధారంగా ఆల్బెండజోల్‌ మాత్రను అందించాలని తెలిపారు.

Check Also

ఏం.ఎల్‌.సి. ఎన్నికల నేపథ్యంలో మాడల్‌ కోడ్‌ పాటించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏం.ఎల్‌.సి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »