కామారెడ్డి, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభలినందున జిల్లాలోని కోళ్ళ పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోళ్ళ రైతులకు, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి కోళ్లలో వచ్చే వివిధ వ్యాధులు ముఖ్యంగా ఏవియన్ ఇన్ఫ్లుంజ్ గూర్చి అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా పౌల్ట్రీ రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, మహారాష్ట్ర సరహద్దున మన కామారెడ్డి జిల్లా ఉన్నందున జిల్లాలోని కోళ్ళ పెంపకం దారులకు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా.లోని అన్ని మండలాల్లో ఇలాంటి అవగాహన సదస్సులను నిర్వహించాలని తెలియజేసారు. వ్యాధి సోకక ముందు నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
చనిపోయిన కోళ్లను దూరంగా పారవేయాలని (ప్రాపర్ డిస్పోజల్) తెలిపారు. వ్యాక్సినేషన్, ఇమ్యూనిసేషన్ బూస్టర్ వాడాలని తెలిపారు. మహారాష్ట్ర నుండి కోళ్ళ రవాణా జిల్లాలోకి రాకుండా సరిహద్దున చెక్ పోస్టుల్లో తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మండల పశు వైద్యాధికారిని సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖాధికారి కే. సంజయ్ కుమార్, సహాయ సంచాలకులు శ్రీనివాస్, భాస్కరన్, డాక్టర్ ఆర్.దేవేందర్, పశు వైద్యులు, పారా సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.