నిజామాబాద్, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమానికి ప్రగతి పథకాలు అమలు చేయడానికి మరింత అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్‌కి వినతిపత్రాన్ని సమర్పించినట్లు రాష్ట్ర ఫెడరేషన్ ఉపాధ్యక్షులు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తెలిపారు.
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో బుధవారం ఫెడరేషన్ రాష్ట్రస్థాయి సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లు ఆయన వివరించారు. న్యాయవాదుల ఆరోగ్య భీమా ఐదు లక్షలకు పెంచాలని, బార్ అసోసియేషన్ పదవీకాల పరిమితిని సంవత్సరం నుండి రెండేళ్ల వరకు పొడిగించాలని కోరారు.
అడ్వొకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తయారు చేసేవిదంగా కృషి చేయాలన్నారు. కార్యక్రంలో రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొండల్ రెడ్డి కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి, వివిధ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు.