బాన్సువాడ, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ ప్రభుత్వ ఏరియా, మాత శిశు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు బకాయి వేతనాలను చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం ఆస్పత్రి ముందు ధర్నా చేపట్టారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు, కమర్ అలీ, రేణుక, సంతోష్ గౌడ్, సురేఖ, సంగీత, కళ్యాణి, గంగారం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.