నిజామాబాద్, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులకు ఒక సంవత్సరం పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవ సంస్థ చైర్మన్ సునీత కుంచాల డిఫెన్స్ కౌన్సిల్ రాజ్‌కుమార్ సుబేదార్, ఉదయ్ కృష్ణ, శుభం, ప్రమోద్ లకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పేదలకు ఈ వ్యవస్థ ద్వారా ముందు ముందు ఇంకా ప్రతిష్టంగా సేవలను అందిస్తూ పేదవారికి న్యాయ సహాయమును చట్టబద్ధంగా సాయపడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి పద్మావతి పాల్గొన్నారు.