జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సోమవారం 10వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్టు జక్రాన్‌పల్లి ఎస్‌ఐ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే… సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో జాతీయ రహదారి పైన పడకల్ తండా గ్రామం వద్ద, జక్రాన్‌పల్లి నుంచి అమృతాపూర్ గ్రామానికి తాళ్ల విజయకుమార్ అను వ్యక్తి ట్రాక్టర్‌పై పశుగ్రాసం నిమిత్తం మొక్కజొన్న గడ్డిని తరలిస్తున్నాడు.
ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న అమృతాపూర్ గ్రామానికి చెందిన తేలు రాజేశ్వర్, సిర్నాపల్లి వడ్డెన్న ఇద్దరు వ్యక్తులు కిందపడ్డారు. అటువైపుగా వస్తున్న గుర్తుతెలియని కంటైనర్ వాహనం ఢీకొనడంతో సిర్నాపల్లి వడ్డెన్నకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందగా, తేలు రాజేశ్వర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు ఎస్‌ఐ అన్నారు. కాగా వడ్డెన్న భార్య ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ విజయ్‌పై, గుర్తు తెలియని వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు పేర్కొన్నారు.