నిజామాబాద్, ఫిబ్రవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కేంద్ర ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఈరోజు 11. 02,2025 నిర్వహించే సేఫర్ ఇంటర్నెట్ డేని మన జిల్లాలో కూడా ఐడిఓసిలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి మధు, ఐ డి ఓ సి పాలనాధికారి ప్రశాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో మధు ఇంటర్నెట్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, దానిని సరిగా వాడకపోతే ఎటువంటి దుష్పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దానిలో తీసుకునే జాగ్రత్తలను తెలిపారు. అదేవిధంగా సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయి దాని నుండి మనల్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను వివరించారు.
ఐడిఓసి పాలనాధికారి ప్రశాంత్ మాట్లాడుతూ మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లనే మనం సైబర్ నేరాలలో బాధితులం అవుతున్నామని చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు వారి ఉద్యోగులు పాల్గొన్నారు.