నిజామాబాద్, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో గల మహిళా సంఘా సభ్యులకు ఆరోగ్యం.. పిల్లల పోషణ, పరిసరాలు పరిశుభ్రత, పారిశుధ్యం, రక్తహీనత, సమతుల ఆహారం తీసుకునేలా, గర్భవతిగా తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలగు అంశాలపై అవగాహన కల్పించాలని ఏపిఎం, సీసీ లకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కోరారు.
స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు, ఆదాయం పెరిగిన దానికి తగిన విధంగా ఖర్చులు పెరిగినా విధంగా జీవన శైలిలో మార్పులు, మంచి ఆహారపు అలవాట్లు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, మంచి ఆహారపు అలవాట్లు జీవన ప్రమాణాలను పెంచుతాయని, ఆరోగ్యమే మహాభాగ్యంగా మహిళలందరూ జీవించాలని కోరారు.

శిక్షణ కార్యక్రమాల్లో అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, రిసోర్స్ పర్సన్‌లుగా డిపిఎం సాయిలు, శ్రీనివాస్, ఏపిఎం సరోజినీ, గంగాధర్, రాజేందర్ అన్ని మండలాలు ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.