బాల్కొండ, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాదాత ఏనుగు దయానంద రెడ్డి సౌజన్యంతో సుమారుగా 1000 మంది మహిళా నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం జాబ్ మేళాను చిట్టాపూర్ గ్రామంలోని వసంత ఫంక్షన్ హాల్‌లో ఈనెల 23న ఆదివారము 11:00 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్, దక్షిణ ఆసీయా మైత్రి సదస్సు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల సెక్రటరీ జనరల్ బ్రహ్మ రౌతు నరసింగరావు తెలిపారు.
ఏనుగు దయానంద్ రెడ్డి నేతృత్వంలో భారీ పరిశ్రమలల్లో ఎందరో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి కుటుంబాల జీవితాలను బాగు చేసిన మహోన్నతుడని నర్సింగ్ రావు ఈ సందర్భంగా వివరించారు.