జక్రాన్పల్లి, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గ్రాడ్యుయేట్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా జక్రాన్పల్లి మండల కేంద్రానికి ఉమ్మడి నిజామాబాద్ మెదక్, కరీంనగర్, అదిలాబాద్ బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి కుమార్తె అశ్విత రెడ్డి జక్రాన్‌పల్లిలో శనివారం గ్రాడ్యుయేట్లను కలిసి, గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ అనేక సమస్యల గురించి పోరాడుతూ ఎస్‌ఆర్ ట్రస్టు ద్వారా నిరంతరం ప్రజాసేవలో పాల్గొంటున్న, ప్రభుత్వ బడుల్లో కళాశాలలో మౌలిక వసతుల కొరకు ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించిన, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే అంజి రెడ్డికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని ఓటర్లను అభ్యర్థించారు.
కార్యక్రమంలో జక్రాన్‌పల్లి మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేష్, వంశి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చక్రపాణి, సాయిలు, తిరుపతిరెడ్డి, నవీన్, రాజారెడ్డి, భూమేష్, మోహన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.