నిజామాబాద్, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జయంతి ఉత్సవాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు.
వినాయకనగర్ లో గల సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి కలెక్టర్ స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భోగ్ బండార్లో పాల్గొని నైవేద్యం స్వీకరించారు.

కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగురావు, వివిధ శాఖల అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.