బాన్సువాడ, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం బంజరులకే కాకుండా అన్ని వర్గాలను అభివృద్ధి బాటలో నడిపించడానికి వారి జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చిన గొప్ప సామాజిక వేత్తా అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన లక్ష్యాలను నెరవేర్చ దిశగా మనమందరం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో తపస్ నాయకులు రమేష్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, రవీంద్ర నాథ్ ఆర్య, తారాచంద్, కిష్టయ్య, వేద ప్రకాష్, నర్సయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.