కామారెడ్డి, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సంత్ సేవాలాల్ మహారాజ్ ఆదర్శ ప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడవాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా కామారెడ్డి రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, ఆర్డీఓ కార్యాలయం డివిజనల్ పరిపాలన అధికారి నర్సింలు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చిరంజీవులు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.