బాన్సువాడ, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని బోర్లం గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ఇటీవల జరిగిన సంఘటన దృష్ట్యా పాఠశాలలో భద్రత ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కమిటీ సభ్యులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేదని, 20 సంవత్సరాలుగా ఫిట్నెస్ లేని వాచ్మెన్ విధులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు భద్రత కొరవడిరదన్నారు. గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తరగతి గదులలో విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో గంగాధర్, సాయిలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.