కామారెడ్డి, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై లక్ష్మి (38) బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. నిజామాబాద్ రక్తదాతల సమూహ నిర్వాహకులు తెలంగాణ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న సాయి వెంటనే స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు కావలసిన వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడమే కాకుండా, తన వంతు బాధ్యతగా సంవత్సరానికి మూడుసార్లు రక్తదానం చేస్తున్న సాయికి ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.