కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఫోక్సో చట్టం పైన ప్రైవేట్ స్కూల్స్‌కి నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి. నాగరానీ, కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జ్ అండ్ సెక్రెటరీ విచ్చేసి పొక్సో చట్టం, స్కూల్లో టీచర్ యొక్క బాధ్యతలను వివరిస్తూ, స్కూల్స్‌లలో ఇటువంటి సంఘటనలు …
Read More »Daily Archives: February 18, 2025
తాగు, సాగునీరు, విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎక్కడ కూడా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి సూచించారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే, సత్వరమే పరిష్కరించాలని అన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ మంచినీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం హైదరాబాద్ …
Read More »వేసవి నీటి అవసరాల దృష్ట్యా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న వేసవికాలములో జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉమ్మడి నిజామాబాదు జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ. శరత్ అన్నారు. మంగళవారం జిల్లాకు చేరుకున్న ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌తో కలిసి పలు అంశాలపై ముఖ్యంగా త్రాగునీటి పైచర్చించారు. వచ్చే వేసవి కాలంలో గ్రామాలలో ఎలాంటి …
Read More »నీటి ఎద్దడి సమస్య లేకుండా కార్యాచరణ రూపొందించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వివిధ శాఖల ముఖ్య కార్యదర్షులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగునీరు, త్రాగునీరు, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా, …
Read More »ఘనంగా రామకృష్ణ పరమహంస జయంతి
కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలు ఆర్కే డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి పూజించారు. పూజ్య రామకృష్ణ పరమహంస ప్రముఖ శిష్యుడు స్వామి వివేకానందాను ఎట్లాగైతే తీర్చిదిద్ది, ప్రపంచానికి అందించారో, అదే విధంగా గత 22 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం విలువలతో కూడిన ఉత్తమ విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును …
Read More »భర్త గెలుపు కోసం భార్య ప్రచారం
బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి గోదావరి పట్టభద్రులను కలిసి భర్త గెలుపు కోసం ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ బిజెపి పార్టీ అన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, పట్టభద్రుల సమస్యల పరిష్కారం …
Read More »ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టిన కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి కాలం దృష్ట్యా మొక్కలకు వాటరింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం గాంధారి మండలం పేట్ సంగం గ్రామంలో రోడ్డుకిరువైపులా ఉన్న మొక్కలకు కలెక్టర్ నీళ్లు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉష్ణోగ్రత పెరుగుతున్న సందర్భంలో మొక్కలకు ప్రతీ రోజూ నీళ్ళు పోయాలని, మొక్కలను సంరక్షించాలని తెలిపారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా …
Read More »తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ.శరత్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకితభావంతో పని చేయాలని, నీటి సరఫరా వ్యవస్థను …
Read More »ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను వెంటనే తొలగించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి, తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఆయా ప్రదేశాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు గాను కలెక్టర్ మంగళవారం నిజామాబాద్ నగర శివారులోని నాగారం, గుండారం ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా గుండారం …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఫిబ్రవరి. 18, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి తెల్లవారుజామున 4.34 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి పూర్తియోగం : గండం ఉదయం 8.15 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 3.30 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 4.34 వరకు వర్జ్యం : ఉదయం 11.47 – 1.34దుర్ముహూర్తము : ఉదయం 8.46 – …
Read More »