కామారెడ్డి, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రానున్న వేసవికాలములో జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉమ్మడి నిజామాబాదు జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ. శరత్ అన్నారు. మంగళవారం జిల్లాకు చేరుకున్న ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌తో కలిసి పలు అంశాలపై ముఖ్యంగా త్రాగునీటి పై
చర్చించారు.
వచ్చే వేసవి కాలంలో గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, అవసరమైన పక్షంలో అద్దె బోర్ల నుండి నీటిని సరఫరా చేయాలని సూచించారు.