కామారెడ్డి, ఫిబ్రవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్ లోని 33/11 కే.వి. ఉప కేంద్రమును కలెక్టర్ సందర్శించారు. విద్యుత్ సరఫరా ఎక్కడి నుండి వస్తుంది, ఎంత మేరకు సరఫరా చేయబడుతుంది, ఒకవేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినపుడు ప్రత్యామ్నాయ చర్యలు ఎలా తీసుకుంటారు, ఎంత మంది సిబ్బంది విధుల్లో ఉంటారు అనే విషయాలను విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఎన్.శ్రావణ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.
132/33 కే.వి. సబ్ స్టేషన్ కామారెడ్డి నుండి సరఫరా అవుతుందని, రెండు 5 ఏం.బి.ఏ. ట్రాన్స్ఫార్మర్స్ నుండి 33/11 కేవి సబ్ స్టేషన్ లోకి కన్వర్ట్ చేయబడి పలు మార్గాల గుండా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. అంతకు ముందు ఏసి, డిసి కంట్రోల్ ప్యానల్‌ను కలెక్టర్ పరిశీలించారు.
విద్యుత్ పంపిణీ నుండి వస్తున్న విద్యుత్ పలు మార్గాల గుండా సరఫరా చేయబడుతున్న వివరాలను ఎస్‌ఈ కలెక్టర్‌కు వివరించారు. ఈ స్టేషన్ లో రౌండ్ ద క్లాక్ సిబ్బంది అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తారు అని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈ ఈ కళ్యాణ్ చక్రవర్తి, ఏడిఈ కిరణ్ చైతన్య, ఏఈ వెంకటేష్, డిఈ ఏంఆర్టి నాగరాజు, ప్రొటెక్షన్ ఏడిఈ జయరాజ్, తదితరులు పాల్గొన్నారు.