ఆర్మూర్, ఫిబ్రవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆలూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ చిన్నయ్య ఆధ్వర్యంలో బుధవారం పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ చిన్నయ్య మాట్లాడుతూ గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, ఇది ఆరోగ్యానికి హానికరమని, చట్టపరంగా నేరమని హెచ్చరించారు.
గంజాయి రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, పంచాయతీ కార్యదర్శి రాజలింగం, కరాబర్ సంతోష్, కాంగ్రెస్ నాయకులు సంజీవ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.