బాన్సువాడ, ఫిబ్రవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ధర్మ రక్ష పరిరక్షణకు పాటుపడుతూ హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ అన్నారు. బుధవారం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో హిందూసేన ఆధ్వర్యంలో శివాజీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన శివాజీ విగ్రహాన్ని బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలని, చిన్ననాటి నుండి చిన్నారులకు భగవద్గీత అందించి హిందూ మతం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పోరాట తత్వాన్ని, ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకొని సాగాలన్నారు. హిందూ సేన ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు వరకు కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హిందూ సేన సభ్యులు, గ్రామస్తులు, యువకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.