ఆర్మూర్, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూరులో విద్యార్థులకు పౌష్టికాహారం- ప్రాధాన్యత అనే అంశంపై కార్యక్రమం నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎస్. చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఫిర్దోజ్ ఫాతిమా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పౌష్టికాహారం యొక్క ప్రాధాన్యం గురించి వివరించారు.
అదేవిధంగా విద్యార్థులు ఎక్కువగా నీరు తాగాలని, ఆరోగ్యంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. వచ్చేది వేసవికాలం కాబట్టి విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉంటూ చక్కగా చదువుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్వైజర్ శాంతమ్మ, ఆనంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జంతు శాస్త్ర, వృక్షశాస్త్ర విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల హెల్త్ సూపర్వైజర్ సంతోషి, ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ చైతన్య శాంతి, అధ్యాపకులు డా. శిరీష, ఉజ్మా నిషాత్, ఈ.వైష్ణవి విద్యార్థులు పాల్గొన్నారు.