బాన్సువాడ, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
దేశంలో ఢల్లీి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో కూడా బిజెపి జెండా ఎగరవేస్తామని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని, రాష్ట్రాల్లో అమలు కానీ హామీలను ఇచ్చి రాష్ట్రాలను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, యువత బిజెపి వైపు చూస్తున్నారని రానున్న ఎన్నికల్లో తెలంగాణలో సైతం బిజెపి జెండా ఎగరవేస్తామన్నారు.
నిరుద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ప్రశ్నించడానికి బిజెపి అభ్యర్థులైన అంజిరెడ్డి కొమురయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, బాపురెడ్డి, మోహన్ రెడ్డి, పెద్దోలా గంగారెడ్డి, చిదుర సాయిలు, లక్ష్మీనారాయణ, శంకర్ గౌడ్, కోణాల గంగారెడ్డి, పార్టీ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.