నిజామాబాద్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎస్‌ఆర్ ఇంపల్స్ విద్యాసంస్థలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారి విద్యార్థులు మాతృభాష తెలుగు సంబంధించినటువంటి పాటలు పాడుతూ నృత్యం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అసోసియేట్ డైరెక్టర్ ఆశిష్‌్, ప్రిన్సిపల్ శిరీష, ఏ.వో రాజ ప్రదీప్, తెలుగు భాష ఉపాధ్యాయులు కమల్ మాట్లాడుతూ అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది, అమృతం కన్నా తీయ్యనైనది అందమైనది మన మాతృభాష తెలుగు భాష అని అన్నారు.
దేశభాషలందు తెలుగు లెస్స అనే శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా అనే వేములపల్లి గీతం మాలపించిన తెలుగువారికి ఎంతో అద్భుతంగా ఉంటాయని గుర్తు చేశారు. దేశంలో 22 అధికార గుర్తింపు భాషల్లో తెలుగు ఒకటనే గుర్తు చేశారు. ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాషను కన్న తల్లిదండ్రులను మరువద్దని గుర్తు చేశారు.
తెలుగు భాష మూలపురుషులు యానాదులు, పురాతత్త్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిదని, ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు కాని తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చని అన్నారు.
అనంతరం మాతృభాష తెలుగులో ప్రతి ఒక్కరు రాణించాలని ఉద్దేశంతో తెలుగు ఉపాధ్యాయులు కమల్ తన వ్యక్తిగతంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహంగా ప్రిన్సిపల్ శిరీష, ఏవో ప్రదీప్ తరగతి ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.